Breaking News: Lockdown will be extended across Indis till 3rd May, 2020 : PM narendra modi

- బిగ్ బ్రేకింగ్ న్యూస్: మే 3 వరకూ లాక్డౌన్
- మే 3 వరకు ఇండియా అంతటా లాక్ డౌన్
- ఇదే ఇక్యమత్యం, స్ఫూర్తిని ..మరో 19 రోజులు చాటాలి .
అంతా ఊహించినట్లుగానే ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ లాక్డౌన్ వల్ల అనేక మంది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని ప్రధాని గుర్తుచేశారు. అయినా, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరూ సహనం వహించారని.. సైనికుల వలే పోరాడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజలమైన మేము’ అన్న స్ఫూర్తిని చాటారన్నారు. నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేశారు. నేడు దేశాన్ని మహమ్మారిని నుంచి కాపాడుకోవడం కోసం ఐక్యతను చాటడమే అంబేడ్కర్ గొప్ప నివాళి అని వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పండుగలు సాధాసీదాగా జరపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రధాని ప్రసంగంలోని కీలక అంశాలు…