JNTUH Supply Exams 2020 Likely to be Held in 2 Months

Published on

JNTUK Whatsapp Channel

JNTUH Whatsapp Channel

JNTUA Whatsapp Channel

JNTUGV Whatsapp Channel

JNTUH Supply Exams 2020 Likely to be Held in 2 Months

jntuh

చివరి సెమిస్టర్‌ పరీక్షలపై హైకోర్టు క్లారిటీ

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలపై నెలకొన్న అయోమయం తొలగిపోయింది. సెమిస్టర్‌ పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చివరి పరీక్షకు ఎప్పటిలాగే రాతపరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. అటానమస్‌ కళాశాలలు వారికి అనుకూలమైన విధానంలో పరీక్షలు జరుపుకోవచ్చని సూచించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌గా పాసైనట్టు పరిగణిస్తామని స్పష్టం చేసింది.

JNTUH Supply Exams 2020 Likely to be Held in 2 Months

అయితే, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో స్పష్టత ఇస్తే.. విద్యార్థులు దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారని ఎన్‌ఎస్‌యూఐ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి కోరగా.. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది ఆయా శాఖలు నిర్ణయిస్తాయని, దానిపై ఇప్పుడే హామీ ఇవ్వలేమని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. దీనిపై వివరణ ఇచ్చిన జేఎన్‌టీయూహెచ్‌.. రెండు నెలల్లోపు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పరీక్షలను కరోనా జాగ్రత్తలో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దీంతో పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయాలు సిద్ధమవుతున్నాయి. 16 నుంచి జేఎన్‌టీయూహెచ్‌.. 17 నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Source: eenadupratibha.net

8 COMMENTS

  1. Is there any information about the 1-II exams. Or the students who have cleared all subjects the will be promoted automatically?

  2. Sir my name is krishna 2016 passed out batch R09 I have backlogs in 1-1 naming m-1, drawing and in 3-1 design of reinforced concrete structures please inform me when will be my exams will conduct please reply me immediately sir tq.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest articles