AP School Holidays For Class 1 To 9 From 20th April 2021 Due to Corona
AP: 1 నుంచి 9 తరగతులకు రేపటి నుంచి(ఏప్రిల్20) సెలవులు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి (April 20) సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగానే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని.. ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయినట్లు మంత్రి స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు పాటించామన్నారు.
about engineering college