Lockdown in Telangana extended till 30th April 2020 (తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు)

Published on

JNTUK Whatsapp Channel

JNTUH Whatsapp Channel

JNTUA Whatsapp Channel

JNTUGV Whatsapp Channel

Lockdown in Telangana extended till 30th April 2020 (తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు): Chief Minister of Telangana K Chandrashekhar Rao announced in a press meet that the lockdown in the state is extended till 30th April 2020. The decision is announced after a Special State Cabinet meeting held at Pragathi Bhavan at 3 PM.

KCR_Sir

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నామని కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయించామని తెలిపారు. ప్రజల క్షేమం కోసమే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 30 తరువాత దశలవారీగా లాక్‌ డౌన్‌ను ఎత్తేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. నేడు ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని చెప్పారని కేసీఆర్ అన్నారు. ఒకరిద్దరు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పరీక్షలు జరగలేదనే ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉందన్న కేసీఆర్… ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ ఎగువ తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని రైతాంగానికి ఏప్రిల్ 15 వరకు సాగునీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest articles