AP Degree, B.Tech, PG Final Semester Exams cancelled !

125

AP Degree, B.Tech, PG Final Semester Exams cancelled !

Latest News: 25-06-2020

యూజీ, పీజీ పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు – మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి

అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) పరీక్షలపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయం తరఫున ప్రకటన విడుదల చేస్తూ.. ‘యూజీ, పీజీ పరీక్షలు రద్దు అనేది నిర్ణయం కాలేదు. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలా నిర్వహించాలనే ఇప్పటి వరకు ప్రయత్నాలు చేశాం. సాధ్యా సాధ్యాలపై అన్ని వర్సిటీల వీసీలు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నాం. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. సీఎం వైఎస్ జగన్తో చర్చించిన తరువాత ఆయన ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించడం, రద్దు చేయటంపై తుది నిర్ణయం వెల్లడిస్తాం.’ అని పేర్కొన్నారు. కాగా, ఒంగోలులోని తన క్యాంపు కార్యాల యంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ డిగ్రీ, బీటెక్ తదితర పరీక్షల నిర్వహణపై వీసీలతో చర్చలు జరిపినట్లు తెలిపారు.

ap degree btech exams cancelled

ఏపీలో డిగ్రీ, పీజీ, బీటెక్ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు!

అమరావతి: డిగ్రీ, పీజీ, బీటెక్, వృత్తి విద్య, అన్ని కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని పలువురు వెల్లడించారు. ఉపకులప తుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయా లను సీఎం జగన్‌కు వివరించి, అధికారికంగా నిర్ణయం వెల్లడించనున్నారు. డిగ్రీ మొదటి, రెండు, బీటెక్ మూడేళ్లు, పీజీ మొదటి ఏడాది విద్యార్థులకు ప్రస్తుతం ఎలాంటి పరీక్షలు నిర్వ హించకుండా పై తరగతులకు పంపిస్తారు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత వీరికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షల నిర్వహణ, అకడమిక్ క్యాలెండర్ పై వర్సిటీల వీసీలతో మంగళవారం మంత్రి ఆది మూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కళాశాల విద్య ప్రత్యేక కమి షనర్ నాయక్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి వీడియో కాన్ఫ రెన్సు నిర్వహించారు. పరీక్షలను రద్దు చేస్తే కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన సెమిస్టర్, మిడ్, ఇతర అంతర్గత మార్కులు, సబ్జెక్టుల వారీగా మౌఖిక పరీక్షలు(వైవా), ఏదైనా చిన్న పరీక్ష నిర్వహించడం ఆధారంగా చివరి సెమిస్టర్ విద్యార్థులకు మార్కులు కేటాయించాలని నిర్ణయించారు.

  • చివరి సెమిస్టర్ విద్యార్థులకు గత సంవత్సరాల్లో ఫెయిల్ అయిన సబ్జె క్టులు ఉంటే వాటికి అంతర్గత మార్కులు, మౌఖిక పరీక్షల ఆధారంగా క్రెడిట్లు కేటాయిస్తారు.
  • అకడమిక్ సంవత్సరం ఆగస్టులో ప్రారంభం కానుంది. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు.
  • వర్సిటీలు కొన్ని సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాయి. మిగతా సబ్జెక్టు లకు పరీక్షలు నిర్వహించకుండా అంతర్గత మూల్యాంకనం ద్వారా క్రెడిట్లు కేటాయిస్తారు.

Source: eenadu.net

Previous articleAP SBTET Assessment of Industrial Training for VI Sem – Conduct of 2nd Unit test for IV and V Sem and 3rd Unit test for I year Students
Next articleCBSE Class 10th Exams Cancelled, Class 12 students will have option: CBSE tells Supreme Court

125 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here