AP Gurukulam 5th Class Online Application 2020 – Admission Procedure, Eligibility

0

AP Gurukulam 5th Class Online Application 2020 – Admission Procedure, Eligibility, Selection, Online Apply Procedure available at aprjdc.apcfss.in.

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో లాటరీ పద్ధతి ద్వారా 2020-21 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సం స్థచే నడుపబడుచున్న 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా ,కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లా తో సహా) 2020-21 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్థులను జిల్లావారీగా సంబంధిత జిల్లా కలెక్టరు వారి కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా తెది 27-07-2020 న ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాల కేటాయింపు కౌన్సిలింగ్ ద్వారా జరుగును.

AP Gurukulam 5th Class Online Application 2020 – Admission Procedure, Eligibility

Important Dates:

  • Payment Start Date: 04-07-2020 | Payment End Date: 20-07-2020
  • Application Start Date: 04-07-2020 | Application End Date: 20-07-2020

AP Gurukulam 5th Class Admission – Eligibility

I. ప్రవేశానికి అర్హత:

1. వయస్సు : ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2007 నుండి 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.

2. సంబంధిత జిల్లాలో 2018-19 & 2019-20 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి.

3. 2018-19 మరియు 2019-20 విద్యాసంవత్సరాలు నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి

4. 2019-20 విద్యాసంవత్సరం నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4 వ తరగతి చదివి ఉండాలి

5.0.C మరియు B.C విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంత S.C మరియు S.T. విద్యార్థులు జనరల్/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.

6. ఆదాయపరిమితి : అభ్యర్ధి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2019-20) రూ.1,00,000/- మించి ఉండరాదు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.

AP Gurukulam 5th Class Online Application 2020

II. పాఠ శాలల్లో ప్రవేశము:

1. 2020-21 విద్యా సంవత్సరము నకు అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక, ప్రవేశ పరీక్ష బదులు లాటరీ పద్ధతి ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారిచే ఏర్పాటు చేయబడిన కమిటీ సమక్షంలో జరుపబడును.

2. విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్ గా పరిగణింపబడుతుంది.

3. జిల్లా లోని సాధారణ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఆ జిల్లా లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు

4. మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా అర్హులు.

5. ఈ క్రింది రీజిఒనల్ సెంటర్స్ అఫ్ ఎక్సన్సు పాఠశాలల్లో అభ్యర్థి ఇచ్చికత, ప్రాంతము మరియు రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు: 1. తాడికొండ (గుంటూరు జిల్లా) – 8 కోస్తా జిల్లాలవారు (నెల్లూరు తప్పు) అర్హులు. 2. కొడిగెనహళ్లి ( అనంతపురం జిల్లా) 4. రాయలసీమ జిల్లాలు & నెల్లూరు జిల్లా వారు అర్హులు.

6. దరఖాస్తు:- దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://aprjdc.apcfss.in లేదా http://apreis.apcfss.in. ను చూడగలరు.

AP Gurukulam 5th Class Selection Procedure 2020

III. పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం:

లాటరీలో ఎంపికైన అభ్యర్థులకు

1. రిజర్వేషన్ (రిజర్వేషన్ల వివరాలు పట్టిక (1) నందు ఇవ్వబడినవి ).

2. స్థానికత

3. ప్రత్యేక కేటగిరి (మైనారిటీ/అనాధ/సైనికోద్యోగుల పిల్లలు) మరియు

4. అభ్యర్థి కోరిన పాఠశాల ఆధారంగా ఎంపిక జరుగును.

5. ఏదేనీ ఒక రిజర్వేషన్ కేటగిరిలో అభ్యర్థులు లేని యెడల అట్టి రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి .రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు కేటాయిస్తారు. కానీ మైనారిటీ పాఠశాలలకు చెందిన ఖాళీలను మైనారిటీ అభ్యర్థులతో మాత్రమే నింపుతారు. ఈ పాఠశాలల మైనారిటీ ఖాళీలను వేరే ఏ కేటగిరి వారికి కేటాయించరు.

6. ప్రత్యేక కేటగిరి లకు సంబంధించిన (అంగవైకల్యం, అనాధ మరియు సైనికోద్యోగుల పిల్లలు) ఖాళీలు మిగిలినచో అట్టి ఖాళీలను మెరిట్ ప్రాతిపదికన ఓపెన్ క్యాటగిరి వారికి కేటాయిస్తారు.

7. జిల్లాలవారీగా పాఠశాలల వివరాలు, ఆ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హతగల జిల్లాలు పట్టిక (2) నందు ఇవ్వబడినవి.

8. ఎంపికైన అభ్యర్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది.

AP Gurukulam 5th Class Online Apply Procedure 2020

IV. దరఖాస్తు చేయు విధానం :

1. అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెంది ప్రాధమిక వివరాలతో (1. అభ్యర్థి పేరు, 2. పుట్టినతేది మరియు 3. మొబైల్ నెంబర్) ఆస్ లైన్ ద్వారా రూ. 50/- చెల్లించిన తరువాత ఒక జర్నల్ నెంబరు ఇవ్వబడుతుంది.

2. జర్నల్ నెంబరు పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకొన్నట్లు కాదు. అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియచేయు నెంబరు మాత్రమే.

3. ఆ జర్నల్ నెంబరు ఆధారంగా http://aprjdc.apcfss.in లేదా http://apreis.apcfss.in. ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ జర్నల్ నెంబరును పరీక్ష ఫీజు చెల్లించిన కాలమ్ లో నమోదు చేయవలెను క్రిడిట్ కార్డు సౌకర్యం కలవారు అట్టి కార్డు ద్వారా కూడా సులభంగా దరఖాస్తు రుసుము చెల్లించవచ్చును.

4. గడువు: ఆన్లైన్ ద్వారా ది.04-07-2020 నుండి తేది.20-07-2020 వరకు ఎన ఆలిఎన ఎబ్బట్ నుండి దరఖాస్తు చేసుకో వచ్చును.

5. ఆన్ లైన్ లో దరఖాస్తును పంపిన తరువాత ఒక రిఫరెన్స్ నెంబరు ఇవ్వబడును. నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.

6. నమూనా దరఖాస్తు ఫారం పట్టిక (3) లో ఇవ్వబడినది. దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకొని ఒక పాస్ పోర్ట్ సైజు (3.5cmx4.5cm) ఫోటోను కుడా సిద్ధము చేసుకొనవలెను.

7. దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరి ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ ధృవీకరణ, పుట్టిన తేదీ ధృవీకరణ మొదలగు పత్రాలు (ఒరిజినల్) పొందియుండాలి. ఒక వేళ దరఖాస్తు సమయానికి లేనియడల అట్టివారు పైన తెలిపిన ధృవీకరణ పత్రాలు ప్రవేశ సమయానికల్లా పొంది యుండాలి. ధృవపత్రాల ఒరిజినల్స్ ప్రవేశ సమయంలో సమర్పించాలి.లేని యడల విద్యార్థి ఎంపిక కాబడినను ప్రవేశము కల్పించబడదు.

8. ఆన్ లైన్ లో కాక నేరుగా సంస్థకు గాని, గురుకుల పాఠశాలలకు గాని పంపిన దరఖాస్తులను పరిశీలించరు. అట్టి అభ్యర్థులు 27-07-2020 న జరుగు లాటరీ కి అనుమతింపబడరు.

9. అర్హతలేని అభ్యర్థుల దరఖాస్తులు తిరస్క రించబడును.

10. ఆన్ లైన్ ద్వా రా ది.04-07-2020 నుండి తేది.20-07-2020 లోగా రుసుము రూ. 50/చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి . నింపిన దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా వెంటనే తప్పనిసరిగా సమర్పించ వలెను. దరఖాస్తు చేయు విధానంలో సందేహ మున్నచో కార్యాలయ పనివేళలు ఉ. 10.00 నుండి సాయంత్రం 5.30 గం. లోపు ఈ ఫోన్ నెంబర్ల లో – 9676404618, మం యు 7093323250 సంప్రదించ గలరు.

V. దరఖాస్తు నింపుటలో అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు:

1. దరఖాస్తుని ఆన్ లైన్ లో పంపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకోవాలి.

2. పాఠశాలలు ఎంచుకొనడానికి ముందు పాఠశాలల వివరాల పట్టికను చూచుకొని నింపాలి.

3. పాస్ పోర్ట్ సైజు ఫోటో (3.5cmx4.5cm) నుసిద్ధంగా ఉంచుకోవాలి.

4. దరఖాస్తును నింపునపుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను.

5. దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లకు అభ్యర్థి యే పూర్తి బాధ్యత వహించాలి.

6. తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.

7. ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు తావులేదు. కావున దరఖాస్తు అప్ లోడ్ చేయుటకు ముందే సరిచూచుకోవాలి

Previous articleUNIRAJ Time Table 2020 (New OUT) BA B.Sc B.Com Part 1 2 3 Exam Datesheet @ uniraj.ac.in
Next articleUGC Revised Guidelines On Semester Exams 2020 – Final Year Exams held in September

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here