AP Open School Students Promoted: APOSS cancels SSC, Inter Exams 2020

AP: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులంతా పాస్.. పై తరగతులకు ప్రమోషన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా క్లిష్ట సమయంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఓపెన్ స్కూల్ విధానంలో చదువుతున్న టెన్త్, ఇంటర్ విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.68 లక్షల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాస్ కానున్నారు.