OU To Conduct Exams First For Final Semester (చివరి సెమిస్టర్‌ విద్యార్థులకే తొలుత పరీక్షలు)

1

Osmania University To Conduct Exams First For Final Semester (చివరి సెమిస్టర్‌ విద్యార్థులకే తొలుత పరీక్షలు): Osmania University has taken a major decision about the Degree examinations. As per which, the university decided to organize the Degree final year/semester examinations earlier than the other semesters. The concerning notification, relaxation in fee payment dates, and everything related to the Degree examinations to be notified soon by the OU. As per the speculations, the university is planning to organize the degree final semester examinations in June. The students of remaining semesters will get promoted without the examinations, the OU mentioned.

The COVID Lockdown has turned out to be the major challenge for the education sector. During the lockdown, the universities are planning new methods to conduct the examinations. The Osmania University university is planning to conduct the examinations once after the COVID emergency settles down. The university planning to conduct the examinations first for final semester students and the remaining semester students will be promoted to the next academic session. Also, the proposal is going to decide the grades based on the previous semester’s/year’s result. The UGC has announced that the universities can organize the examinations once after the situation comes under control. The UGC has given the green signal for the recommendations made by the committee, which is formed with the vice-chancellors of various universities.

OU To Conduct Exams First For Final Semester (చివరి సెమిస్టర్‌ విద్యార్థులకే తొలుత పరీక్షలు)

సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత అన్ని కోర్సుల్లో చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. జూన్‌లో పరీక్షల నిర్వహణకు అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. మిగతా సెమిస్టర్ల విద్యార్థులను తర్వాతి సెమిస్టర్లకు ప్రమోట్‌ చేయనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 732 అనుబంధ కళాశాలలున్నాయి. చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు తర్వాత కోర్సులు చేయాలన్నా.. ఉద్యోగాలకు వెళ్లాలన్నా పరీక్షలు పూర్తి చేసి ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది. అందువల్ల వారికి తొలుత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. ఆ తర్వాత పొడిగింపు ఉన్నా.. ఉండకపోయినా మే నెలలో పరీక్షల నిర్వహణ అసాధ్యమని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్‌ విడుదల, ఫీజు చెల్లించేందుకు గడువు ఇవ్వడం.. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని జూన్‌లో నిర్వహించనున్నారు. వర్సిటీలోని వివిధ విభాగాల అధిపతులు, పరీక్షల నియంత్రణ విభాగం, అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ అధికారులతో రిజిస్ట్రార్‌ సీహెచ్‌.గోపాల్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ మేరకు నిర్ణయించారు.

The UGC passed some important guidelines by observing the academic timetable and other concerned issues. Also, the UGC has given relaxation to universities to make certain changes according to the local conditions. 

UGC Guidelines For Examinations

మిగతా వారికి తొలుత ప్రమోషన్‌.. తర్వాత పరీక్షలు

మిగిలిన సెమిస్టర్ల విద్యార్థుల విషయంలోనూ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 50 శాతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేసేవారు. ఆ మేరకు ఉత్తీర్ణత సాధించనివారు డిటెయిన్డ్‌ అయ్యేవారు. ప్రస్తుతం డిటెన్షన్‌ లేకుండా అందర్నీ తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేయనున్నారు. తర్వాతి సెమిస్టర్‌ మొదలయ్యాక.. మధ్యలో 15 రోజులు సమయం కేటాయించి అంతకుముందు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదాహరణకు రెండో సెమిస్టర్‌ విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే మూడో సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేస్తారు. ఆ తర్వాత రెండో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. బ్యాక్‌లాగ్‌లు ఉంటే పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. డిటెన్షన్‌ మాత్రం చేయరు. ఈ విధానం యూజీ, పీజీ కోర్సులకే వర్తిస్తుంది. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ వంటి కోర్సుల విషయంలో ఏఐసీటీఈ, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.

Except for the final semester, remaining all semester’s students will be promoted to the next semesters without exams. As per the university guidelines, students who secure 50% of marks in the exams will only get promoted to the next semester; otherwise, students will be detained. Now, without the detention, all the students will be promoted to the next semesters. After starting the new semester classes, the varsity is going to conduct the previous semester examinations by taking a break of 15 days. The same procedure will be followed for all the UG and PG courses. While comes to the Engineering, Pharmacy, MCA, MBA examinations, the university will follow the guidelines of AICTE and Pharmacy Council of India.  

ప్రశ్నపత్రంలోనూ మార్పులు

University Registrar C. H. Gopal Reddy has recently communicated with Academic Cell Officials through video conference regarding the OU Degree examinations. In this conference, major aspects were discussed like examination syllabus, exam pattern, dates, fee, and other related topics. The university is focusing on the syllabus, which is going to be considered for the examinations. That is the university is going to consider a portion of the syllabus for the examinations, as the overall syllabus has not completed yet. Also, the plans were in progress to include more multiple-choice questions in the examination by re-designing the exam pattern.

పరీక్షల విధానంలోనూ మార్పులు చేయాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు యూజీ కోర్సుల్లో 80 శాతం, పీజీ కోర్సుల్లో 60-70 శాతం మేర పాఠ్యాంశాలు పూర్తయ్యాయి. మిగిలిన పాఠ్యాంశాలను ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. పూర్తి సిలబస్‌ ప్రకారం ప్రశ్నపత్రం ఇవ్వాలా, వద్దా అన్న విషయంపై ఉన్నత విద్యామండలితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రశ్నపత్రంలో మార్పులు చేసి ఐచ్ఛికాలు (ఛాయిస్‌లు) ఎక్కువగా ఇవ్వాలని వర్సిటీ నిర్ణయించింది. పరీక్షల్లో విద్యార్థులు ఎడం పాటించేలా బెంచీకి ఒక్కర్నే కూర్చోబెట్టనున్నారు.

Osmania University is going to arrange a COVID-19 zone to solve the student’s problems related to the examinations, curriculum, and other issues. In the UGC department also this zone will be arranged. The helpline center will be arranged in the UGC office.

Previous articleAP Covid 19 Special Recruitment Drive Notification – Apply Online For 1070 Posts @ dme.ap.nic.in
Next articleJNTUH Circular on Lockdown extension till 7th May 2020

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here