JNTUA Final Year Exams to be held From 1st September, 2020

JNTUA Info About Mid, Internal, End, Backlog Exams (I, II, III & IV Years)
Latest News: Updated on 21-07-2020

Online తరగతులకు గ్రీన్ సిగ్నల్
- ఆగస్టు 17 నుంచి Online తరగతుల నిర్వహణ
- సెప్టెంబర్ 1 నుంచి బీటెక్ ఫైనలియర్ పరీక్షలు
- II MID పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు
- జేఎన్‌టీయూ అనంతపురం విధివిధానాలు రూపకల్పన
ఇంజినీరింగ్ తరగతుల నిర్వహణకు సంబంధించి జేఎన్టీయూ అనంతపురం యాజమాన్యం స్పష్టతనిచ్చిం ది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేరకు తరగతుల నిర్వహణ, ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షల షెడ్యూలకు సంబంధించి విధివిధానా లను రూపొందించింది. యూజీసీ మార్గద ర్శకాలకు అనుగుణంగా జేఎన్టీయూ అనంతపురం అంతర్గత కమిటీ అయిన ప్రొఫెసర్ సి. శశిధర్ ఆధ్వర్యంలో తాజాగా నిబంధనలు రూపకల్పన జరిగింది. కమిటీ సిఫార్సుల మేరకు జేఎన్టీయూ అనంత పురం రిజిస్టార్ ఎం. విజయ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పై తరగతులకు ప్రమోట్..
బీటెక్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహిం చకుండానే కోర్పు రెండో సంవత్సరానికి ప్రమోట్ చేస్తారు. అయితే ఈ ప్రమోట్ చేసే విధానంలో మార్చి 17 వరకు ఆన్లైన్ హాజ రును పరిగణలోకి తీసుకోవాలి. లా డౌన్ సమయంలో ఆన్లైన్ తరగతులకు సంబం ధించిన హాజరును పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్, ఆన్లైన్ తరగతుల హాజరు శాతాన్ని బట్టి పై తరగతికి ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. బీటెక్ రెండో సం వత్సరం చదివే విద్యార్థికి మూడో సంవత్సరా నికి, మూడో సంవత్సరం చదివే విద్యార్థికి నాలుగో సంవత్సరానికి ప్రమోట్ చేస్తారు. హాజరు శాతం సరిగా లేకపోతే డిటైన్ (నిలుపుదల ) చేస్తారు. 2020-21 విద్యా సం వత్సరానికి సంబంధించిన సబ్జెక్టులు చదువు కోవచ్చు. అయితే 2019-20 విద్యా సం వత్సరం సెమిస్టర్ పరీక్షలు మాత్రం కరోనా ఉధృతి తగ్గిన తరువాత నిర్వహించనున్నారు.
అయితే పై తరగతులకు ప్రమోట్ చేయడానికి క్రెడిట్స్ మినహాయింపు కల్పించారు. ఇక… ల్యాబోరేటరీ హాజరు లెక్కింపునకు.. ప్రాక్టికల్ తరగతులకు హాజరయిన సరాసరి హాజరును బట్టి ల్యాబోరేటరీ హాజరు లెక్కిం చాలని కమిటీ సిఫార్సు చేసింది.
సెప్టెంబర్ 1 నుంచి ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలు..
సెప్టెంబర్ 1 నుంచి ఫైనలియర్ విద్యార్థు లకు సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే. ఫైనలియర్ విద్యార్థులకు బ్యాక్ లాగ్స్ ఉంటే సప్లిమెంటరీ పరీక్షలు సైతం నిర్వహించాలని యూజీసీ స్పష్టం చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ఫైనలియర్ విద్యార్థులకు రెగ్యులర్ పరీక్షలు పూర్తయిన తరువాత సప్లి మెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఫైనలియర్ విద్యార్థులకు రెండో మిడ్ పరీక్షలు ప్రధాన పరీక్షలు నిర్వ హించినప్పుడే జరుగుతాయి. బీటెక్ ఫైనలి యర్ విద్యార్థులు (అనంతపురం, వై స్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు) 5 జిల్లాల్లో కలిపి 37 వేల మంది హాజరుకానున్నారు.
జంబ్లింగ్ విధానం రద్దు..
జేఎన్టీయూ అనంతపురం పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహించేవారు. కానీ తాజాగా బీటెక్ ఫైనలియర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానానికి స్వస్తి చెప్పారు. విద్యార్థి ఏ ప్రాంతంలో నివాసం ఉంటారో .. అక్కడి దగ్గరి ప్రాంతా ల్లోనే పరీక్ష కేంద్రం ఆప్షన్ ఎంచుకునే అవ కాశం కల్పించారు. విద్యార్థులను భౌతిక దూరం పాటించి పరీక్షలు నిర్వహిం చుకునేందుకు గదులు ఎక్కువగా కేటా యించాల్సి ఉంటుందని నిబంధనలు రూపొందించారు. ప్రతి రోజూ రెండు బ్రాంలకు మాత్రమే పరీక్షలు జరిగేలా షెడ్యూల్ రూపకల్పన జరి గింది. ప్రతి గదిలో కేవలం 24 మందిని మాత్రమే పరీక్షకు కేటా యించాలి. సీసీ కెమెరాల పర్యవే క్షణ ఉండాలి. వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా చేయాలి.
ఆగస్టు 17 నుంచి తరగతులు..
2020-21 విద్యా సంవత్సరం ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఆన్లైన్ విధానంలో కోర్సుకు సంబంధిం చిన సబ్జెక్టులు బోధించవచ్చు. ఆన్లైన్ హాజ రుశాతాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు.
హాస్టల్ లో ఒక గదిలో ఒక విద్యార్థి..
పరీక్షలు జరిగే సమయంలో క్యాంపస్ కళా శాల హాస్టళ్లు, లేదా అనుబంధ ఇంజినీరింగ్ హాస్టళ్లలో ఒక గదిలో ఒక విద్యార్థి మాత్రమే కేటాయించాలి. ప్రతి రోజూ హాస్టళ్లలో శానిటైజేషన్ చేయాలి.
మార్కుల మదింపుపై స్పష్టత..
ఇంజినీరిం గ్ కోర్సులో అంతర్గత మార్కులు ( ఇంటర్నల్ మార్కులు) ప్రధానమైనవి. ఈ మార్కుల మదింపును ఎలా చేయాలనే అంశం పై కమిటీ స్పష్టతనిచ్చింది. బీటెక్ మొదటి, రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులకు ఇప్పటిదాకా ఒక మిడ్ పరీక్ష మాత్రమే జరిగింది. రెండో మిడ్ పరీక్ష జరగలేదు. ఫైనలియర్ విద్యార్థులకు నిర్వహించే ప్రధాన పరీక్ష సమయంలోనే బీటెక్ మొదటి, రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులకు రెండో మిడ్ పరీక్ష నిర్వహించాలి. రెండో మిడ్ పరీక్ష మార్కులు వచ్చిన తరువాత ఇంటర్నల్ మార్కులను నమోదు చేస్తారు.
Source: Sakshi Paper (21-07-2020, Edition anantapur)
Updated on 20-07-2020
పరీక్షలపై తొలగిన ప్రతిష్టంభన
సెప్టెంబరు 9 నుంచి 30 వరకు నిర్వహణ
జేఎన్ టీయూ పరిధిలోని తుది సంవత్సరం విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన తొలగింది. సెప్టెంబరు 9 నుంచి పరీక్షలు నిర్వహించాలని వర్సిటీ ఉన్నత యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను సోమవారం వర్సిటీ వెబ్ సైట్లో పొందుపరుస్తారు.
ఎక్కడైనా పరీక్షలు రాయొచ్చు
కొవిడ్-19 కారణంగా విద్యార్థులు ఎక్కడైనా పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించారు. జేఎన్‌టీయూ పరిధిలో ఐదు జిల్లాల్లో విద్యార్థులు ఉన్నారు. ఎక్కడికక్కడ కళాశాలల్లో పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించారు. ఈ విధానం వల్ల విద్యార్థులు వసతి గృహాల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. దగ్గర ఉండే కేంద్రంలో పరీక్ష రాయవచ్చు. ఈమేరకు ఆన్ లైన్లో ప్రశ్నపత్రాన్ని పొందుపరుస్తారు.

బ్రాంచిల వారీగా..
జేఎన్‌టీయూ పరిధిలో ప్రతి రోజు పలు బ్రాంచిలకు పరీక్షలు నిర్వహించే వారు. తాజాగా ఒకరోజు ఒక బ్రాంచికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు సమూహంగా ఏర్పడే అవకాశం ఉండదు.
వేగంగా డిగ్రీ పట్టా అందజేత
వర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ తుది సంవత్సరంలో 18 వేలు, బీఫార్మసీ 2500, ఎంబీఏ, ఎంసీఏకు సంబంధించి 4500 మంది విద్యా ర్డులు ఉన్నారు. వారందరికీ పరీక్షలు పూర్తిచేస్తారు. పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకనం చేసి, వేగంగా డిగ్రీలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థుల పరీక్షల పై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తామని ఉపకులపతి శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
JNTUA Guidelines to Conduct Examinations in view of COVID-19
Source: eenadu Paper (20-07-2020, Edition anantapur)