TS 10th Class Exams 2020 Postponed From 23rd March (తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా)

Published on

JNTUK Whatsapp Channel

JNTUH Whatsapp Channel

JNTUA Whatsapp Channel

JNTUGV Whatsapp Channel

TS 10th Class Exams 2020 Postponed: Telangana 10th Class (SSC) Examinations March 2020 are postponed. The court has ordered the rescheduled examination of the exams to be held from 23rd to 30th March, 2020. The exam which is scheduled for tomorrow (21st March) will be held as per schedule.

TS 10th Class Exams 2020 Postponed (తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా)

telangana 10th class exams postponed

కరోనా ఎఫెక్ట్ తెలంగాణలో పదవతరగతి పరీక్షలపై పడింది. పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్ట్ ఆదేశించింది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే, హైకోర్ట్ మాత్రం పిల్లల ఆరోగ్యం రీత్యా పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని కోర్టు ఆదేశించింది. రేపు జరగాల్సిన పరీక్ష యధాతదంగా నిర్వహించాలని కోర్టు తెలిపింది.

Telangana SSC exams 2020 postponed

ఈ నెల 19 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగుకు సంబంధించిన రెండు పేపర్లు పూర్తయ్యాయి.శనివారం హిందీ పేపర్ రాయాల్సి వుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,530 కేంద్రాల్లో 5.34 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వల్ల శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్ధినీ, విద్యార్ధులకు హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో వుంచారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటుచేశామని, తల్లిదండ్రులు భయపడాల్సింది లేదని అధికారులు తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలతో పరీక్షలు వాయిదా వేయక తప్పలేదు.

ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకూ జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ వున్నా పరీక్షలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తే హైకోర్టులో పిల్ వేశారు. దీనిని అత్యవసరంగా భావించిన హైకోర్టు వెంటనే విచారణ జరిపింది. కరోనా భయంతో పిల్లలు పరీక్షలు ప్రశాంతంగా రాసే పరిస్థితులు లేవని పిటిషనర్ తరఫున న్యాయవాది పవన్ కుమా్ వాదించారు. వాదనల అనంతరం పరీక్షలు ఈనెల 30 వరకూ వాయిదా వేయాలని ఆదేశించింది.

HC orders Telangana to postpone 10th class exams 2020

Is Telangana SSC exams postponed?

Yes, Telangana High Court on Friday directed the state and its SSC board to postpone all the SSC exams scheduled to be held from Mar 23 to March 31.

What About 21st March 2020 TS 10th Class Exam?

The exam which is scheduled for tomorrow (21st March) will be held as per schedule.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest articles