TS Inter 2nd Year Exams 2021 Cancelled (తెలంగాణ లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలో పై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సర్కారు…. తాజాగా ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడా రద్దు చేసింది. అలాగే గతంలో ఫస్టియర్ పరీక్షలు కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పరీక్షలు నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల సీబీఎస్ఈ సైతం 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్నే ఫాలో అవుతూ ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది. మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా అందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.