ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం! యూజీసీకి నిపుణుల కమిటీ సూచనలు

2

UGC Committee Recommends To Start New Academic Year In August: The coronavirus lockdown and related uncertainties will most likely delay this year’s academic year by two months. A panel appointed by the University Grants Commission (UGC) has recommended that the next academic year in colleges and universities should be pushed to August, instead of the traditional mid-July start for higher education.

According to HRD Ministry officials, the two reports will now be studied and official guidelines in this regard are expected to be notified by next week.

ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం! యూజీసీకి నిపుణుల కమిటీ సూచనలు

new academic year starts from august 1
  • యూజీసీకి నిపుణుల కమిటీ సూచనలు
  • వర్సిటీలకు వారానికి ఆరు రోజుల పనిదినాలు
  • సంవత్సరాంత పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించాలి
  • పీజీ, యూజీ కోర్సుల్లోకి ప్రవేశాలను ఆగస్టు 31లోపు జరుపుకోవచ్చు

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ స్తంభించిపోయాయి. పరీక్షలు, ఇతరత్రా కార్యక్రమాలు నిలిచిపోయాయి. వాటిని నిర్వహించడంతోపాటు వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహణను ముగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ (యూజీసీ)కు పలు సిపార్సులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరాన్ని 2020 ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలని సూచించింది. అలాగే, సెమిస్టర్ల వారీగా పరీక్షల తేదీలను కూడా కమిటీ వివరించింది. అంతేకాదు.. వర్సిటీలు వారానికి 6 రోజులు పనిదినాలుగా పెట్టుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఆగిపోయిన ప్రాజెక్టు వర్కు డిజర్టేషన్, ఇంటర్న్‌షిప్, ఈ ల్యాబ్స్, సిలబస్‌ పూర్తి, ఇంటర్నల్‌ అసెస్‌మెంటు, అసైన్‌మెంట్లు, ప్లేస్‌మెంటు డ్రైవ్‌ కార్యక్రమాలను మే 16 నుంచి మే 31లోపు పూర్తిచేయాలి.

పరీక్షల షెడ్యూల్‌ ఇలా ఉండాలి..

  • సంవత్సరాంత పరీక్షలు జూలై 1–15 వరకు నిర్వహించాలి.
  • పరీక్షల నిర్వహణలో వర్సిటీలు, కాలేజీలు ప్రత్యామ్నాయ, సులభ మార్గాలను ఎంచుకోవాలి. 
  • యూజీసీ నిర్దేశించిన సీబీసీఎస్‌ విధానంలో తక్కువ సమయంలో పూర్తిచేసేలా చూడాలి.
  • ఓఎమ్మార్‌/ఎంసీక్యూ ఆధారిత పరీక్షలు, ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్, ఓపెన్‌ చాయిస్‌ అసైన్‌మెంటు వంటివి అనుసరించాలి.
  • భౌతిక దూరాన్ని పాటిస్తూ బహుళ షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించాలి.
  • మిడ్‌ సెమిస్టర్‌ తదితర ఇంటర్నల్‌ ఇవాల్యుయేషన్‌ మార్కులకు 50 శాతం, తక్కిన 50 శాతం మార్కులను అంతకుముందు విద్యార్థి పనితీరుకు వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకోవాలి.
  • యూజీ, పీజీ కోర్సుల సెమిస్టర్‌/ఇయర్లీ పరీక్షలను ఆయా వర్సిటీలు లాక్‌డౌన్‌ తొలగింపు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవాలి.
  • ల్యాబ్‌ ప్రాజెక్టులకు బదులు సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ప్రాజెక్టులను ఇవ్వాలి. స్కైప్‌ తదితర విధానాల్లో వైవా నిర్వహించాలి.
  • రాష్ట్ర, జాతీయస్థాయి కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలను ఆయా వర్సిటీలు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవచ్చు.
  • వర్సిటీలు పీజీ, యూజీ కోర్సుల్లోకి 2020–21 ప్రవేశాలను ఆగస్టు 31లోపు నిర్వహించుకోవచ్చు. సెప్టెంబర్‌ 30 నాటికి ధ్రువపత్రాల పరిశీలన జరగాలి. 

Source: sakshi.com

Previous articleRTU B.Tech 5th Sem Result 2020 (Released) – Esuvidha RTU 5th Sem Results 2019 @ esuvidha.info
Next articleCBSE Board Class 10, 12 Exams Will Be Conducted After Lockdown – Press Release

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here