University Of Hyderabad: No Exams for Final Year Students (Only Grading)
డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదివే విద్యార్ధులకు సెప్టెంబర్ లోగా పరీక్షలు నిర్వహించాలని తాజాగా యూజీసీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే హెచ్‌సీయూకి వర్తించవన్న వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.

డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదివే విద్యార్ధులకు సెప్టెంబర్ లోగా పరీక్షలు నిర్వహించాలని తాజాగా యూజీసీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే హెచ్‌సీయూలో చదువుతున్న విద్యార్ధులకు మాత్రం ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా జారీ చేసిన గ్రేడింగే తుది ఫలితాలని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. యూజీసీ ఆదేశాలు అందేలోపే విద్యార్ధులకు గ్రేడింగ్ ఇవ్వడంతో పాటుగా నెలరోజుల క్రితమే మెమోలను సైతం జారీ చేశామని వారు అంటున్నారు. యూజీసీ జారీ చేసిన తాజా ఆదేశాలు హెచ్‌సీయూకి వర్తించవన్న వర్సిటీ అధికారులు.. స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే గ్రేడింగ్ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించారు. యూజీసీ తాజా నిర్ణయంపై చర్చించి 10 రోజుల్లో తుది ప్రకటన చేయనుంది.
Source: TV9 Telugu