AP: జులైలో సెమిస్టర్ పరీక్షలు, ఆగస్టులో డిగ్రీ, ఇంజినీరింగ్ తరగతులు

40

AP: Degree & Engineering Sem Exams in July, Classes in August

Andhra Pradesh: కరోనా కారణంగా ఉన్నత విద్యా సంస్థల ప్రారంభం నెల రోజులు ఆలస్యం కానుంది. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు ఆగస్టు 3 నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే విద్యాసంవత్సరం తరగతుల ప్రారంభం, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పాఠ్యాంశాలు, పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా అకడమిక్ కేలండర్‌ను రూపొందించింది. తరగతులకు 50 శాతం మంది విద్యార్థులనే అనుమతించనున్నారు . విడతలవారీగా కొంతమందికి ఆన్ లైన్, మరికొందరికి నేరుగా తరగతులు నిర్వహించనున్నారు. తరగతి గదుల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. విద్యార్థులు, అధ్యాపకులకు చేతులు కడుక్కోవడానికి సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.

జులైలో సెమిస్టర్ పరీక్షలు

  • LOCKDOWN కారణంగా కొన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పాఠ్యాంశాలు పెండింగ్ పడ్డాయి. వీటిని జూన్ 30లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 15 లోపు పూర్తి చేయాలి. మిగతా 15 రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ప్రయోగాత్మక పరీక్షలు, ఇతర థియరీ పరీక్షలను, జులై చివరినాటికి ముగించాలి.

Also Check: JNTUK Updates | JNTUA Updates | ANU Updates | AU Updates

డిగ్రీ, ఇంజినీరింగ్ తరగతులు.

  • Degree (3,5 సెమిస్టర్) B.Tech (3, 5, 7 సెమిస్టర్) తరగతులు ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశం.
  • ఇంజినీరింగ్ రెండో ఏడాదిలోకి ప్రవేశించేవారికి ఆగస్టు 17 నుంచి తరగతులు.
  • డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు సెప్టెంబరు 15 నుంచి.
  • డిగ్రీ సెమిస్టర్ 3, 5 పరీక్షలు డిసెంబరులో నిర్వహిస్తారు.
  • డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు జనవరిలో మొదటి సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి.
  • ఇంజినీరింగ్ మొదటి ఏడాది విద్యార్థులకు సెప్టెం బరు 2 నుంచి తరగతులు ఉండే అవకాశం ఉంది.
  • MAB, MCA వారికి సెప్టెంబరు 1 నుంచి తరగతులు నిర్వహించే అవకాశం.

Source: eenadu Epaper (07-06-2020)

Previous articleTS 10th Class (SSC) Exams June 2020 Postponed – పదవ తరగతి పరీక్షలు వాయిదా
Next articleAPSCERT Books Class 1 to 12 PDF in English, Hindi, Telugu – eBooks

40 COMMENTS

  1. Will you give clear information about semester sir plzzz. There is a semester for 2nd 3rd year or only for final year sir..

  2. How we have to write final semister exams we have not completed syllabus and we have not written 2mid exams Mpharmacy

  3. Cancel the sem exam s because in this situation exam are not important all students are not supported please sir All student s promate higher education

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here